YCP MLA Attack On TDP MLA in Assembly : అసెంబ్లీలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి .. మరో ఎమ్మెల్యేపై అనుచిత ప్రవర్తన

సాక్షాత్తూ అసెంబ్లీ సభలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారు. అంతేకాదు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దూకుడుగా వ్యవహరించారు.

YCP MLA attacked TDP MLA : ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిథులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? చట్టాలు చేసే అసెంబ్లీ వేదికపైనే ఓ ప్రజాప్రతినిధిపై మరో ప్రజాప్రతినిథి దాడి చేసిన ఘటన చట్టసభలకు అత్యంత సిగ్గు చేటుగా మారిన ఘటన ఆంధ్రప్రదేశ్ అసెబ్లీలో చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటనకు ఆంధప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై ఏకంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనతో చట్టాలు చేసే అసెంబ్లీ సభ ఇటువంటివారా ప్రజాప్రతినిథులు? అనుకునేలా వ్యవహరించారు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు. దీంతో అసెంబ్లీలోనే ఓ ఎమ్మెల్యే వీధి రౌడీల్లా వ్యహరించటం సిగ్గుచేటని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన క్రమంలో అధికార పార్టీ తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేను ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై దాడి చేశారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద వీరాంజనేయస్వామి కిందపడిపోయారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వద్ద ఉన్న ప్లకార్డును లాగేసుకుని ఆయన్ని నెట్టేశారు మరో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. దీంతో టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా అధికారపార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తు ఆందోళనకు దిగారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత అనుచితంగా వ్యవహరించినా స్పీకర్ మాత్రం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము సభా హక్కులను..సభా నియమాలను పాటిస్తున్నా..తమపై చిన్నపాటి తీరుపై సస్పెండ్ చేసే స్పీకర్ అధికార పార్టీ నేతలు ఎంత అనుచితంగా వ్యవహరించినా ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని ఇది స్పీకర్ పక్షపాత వైఖరిని నిదర్శనమని విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలపై దాడి చేయటంతో తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్న టీడీపీ నేతలు మనం ఎక్కడికి పోతున్నాం. ఇది అసెంబ్లీనా లేదా వీధి రౌడీలు కొట్టుకునే నడిరోడ్డా? అంటూ ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేలపై జరిగిన ఈ ఘటనలు బయటపెట్టాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి ఘటన జరగలేదని ఇది వైసీపీ అధికారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఏపీలో కూడా అసెంబ్లీ సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగిన సందర్భంలో కూడా ఇటువంటి ఘటనలు జరగలేదని..విమర్శలు ప్రతివిమర్శలు జరిగినా ఇటువంటి ఘటనలు మాత్రం ఎప్పుడూ జరగలేదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో వైసీపీ నేతలు తీవ్ర ప్రస్టేషన్ లో ఉండి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వీరాంజనేయస్వామిపై జరిగిన దాడి విషయాన్ని అచ్చెన్నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పీకర్ ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజలకు చట్టసభలపై నమ్మకంపోతుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు