Ycp Mlc Anantha Babu
YCP MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ హై కమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా..ఆయన అనుచరులు మాత్రం ఆయనపై మాత్రం విపరీతమైన ప్రేమాభిమానాలు చూపుతున్నారు. ప్రభుత్వం కార్యక్రమంలో అనంతబాబు ఫ్లెక్సీ పెట్టి పూలతో అభిషేకించారు.దీంతో ప్రభుత్వ కార్యక్రమంలో అనంతబాబు ఫోటో ఉండటంపై వివాదం నెలకొంది. అనంతబాబు ఫోటోతో అల్లూరి జిల్లా అడ్డతీగలలలో అనంతబాబు అనుచరుల హంగామా చేశారు.
ఎమ్మెల్యే ధనలక్ష్మి సారథ్యంలో అల్లూరి జిల్లా ఇందుకూరుపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీతో అనంతబాబు అనుచరులు (వైసీపీ కార్యకర్తలు) నానా హంగామా చేశారు. అనంతబాబు ఫ్లెక్సీకి వైసీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి ఊరేగించారు. డీజే పెట్టి మరీ అనంతబాబు ఫ్లెక్సీని ఊరేగించారు. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుపై పలు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ హత్య కేసు తరువాత పార్టీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఇటీవల వైసీపీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు జైలులో ఉన్నాడు. ఆయన ఫోటోను ఫ్లెక్సీలో వేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్న నిందితుడు ఫోటోను ఫ్లెక్సీలో ఎలా వేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.