Vijayasai Reddy : విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.

Vijayasai Reddy

Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కోర్టు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లివస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు కనీసం రెండు వారాల అనుమతివ్వాలని ఆయన కోరారు.

కాగా విజయసాయిరెడ్డి పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. దీంతో విజయసాయిరెడ్డి పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.