Vijayasai Reddy : చంద్రబాబుకి జీవితఖైదు, విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు.
- Naveen
- Published On : July 14, 2021 / 05:30 PM IST
Vijayasai Reddy
Vijayasai Reddy : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు. ”అనుకూల మీడియా సాయంతో చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాడు. అదే ఇంకో రాష్ట్రంలో అయితే జీవిత ఖైదు పడి కారాగారంలో మగ్గేవాడు. దోచుకున్న డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయొచ్చని లక్షల కోట్లు పోగేశాడు తప్ప వారి సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. అన్నీ బయటికొస్తున్నాయి. తప్పించుకోలేడు” అని విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి. ‘తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమే కాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు. అరెస్టు తప్పించుకునేందుకు 5 కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
‘తెలంగాణలో టీడీపీ ఉంటుంది.. కాంగ్రెస్ ఉంటుంది.. కేంద్రంలో బీజేపీ ఉంటుంది. అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారు. తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారు. ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారు. ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
అనుకుల మీడియా ఊతకర్రలతో ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాడు బాబు. అదే ఇంకో రాష్ట్రంలో అయితే జీవిత ఖైదు పడి కారాగారంలో మగ్గేవాడు. దోచుకున్న డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయొచ్చని లక్షల కోట్లు పోగేశాడు తప్ప వారి సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. అన్నీ బయటికొస్తున్నాయి. తప్పించుకోలేడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2021
