YCP MLC Candidates : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్న వైసీపీ

ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి.

YCP MLC Candidates  : ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి. మిగిలిన ఏడు స్థానాలకు అభ్యర్థులపై సోమవారం తుది కసరత్తు చేయనున్నారు. సామాజిక సమీకరణాల వారిగా సీఎం జగన్ పెద్ద పీఠ వేయనున్నారు.

కడప జిల్లా నుంచి రామసుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి మెరుగు మురళీ, అనంతపురం నుంచి నవీన్ నిచ్చల్, పశ్చిమగోదావరి నుంచి గుమ్మం నాగబాబు, వంకా రవీంద్రా, తూర్పుగోదావరి నుంచి బొమ్మ ఇజ్రాయిల్ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. సోమవారం మరోసారి పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వైసీపీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

BJP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్ని ప్రకటించిన బీజేపీ.. తెలంగాణలో ఒకరు… ఏపీలో ముగ్గురి పేర్లు ఖరారు

రాష్ట్రంలో మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఇప్పటికే ఐదు స్థానాలకు సంబంధించి అభ్యరర్థులను ప్రకటించారు. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిపి మొత్తం ఐదుగురు అభ్యర్థులను ఇప్పటికే వైసీపీ అధికారికంగా ప్రకటించింది. అయితే మరో 9 మంది అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన రావాల్సివుంది. వీటిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు.

తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి ఇద్దరి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందులో కోనసీమ జిల్లాకు సంబంధించిన శెట్టిబలిజ సంఘం అధ్యక్షులుగా ఉన్న గుడిపూడి సూర్యనారాయణ పేరును సీఎం జగన్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు కృష్ణా జిల్లా కైకలూరుకు సంబంధించిన జయమంగళ వెంకటరమణ పేరు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మిగిలిన ఏడుగురికి సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్ ఇప్పటికే ఫైనల్ అయిన లిస్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు