Job in Flipkart: భారీ ప్యాకేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం

కరోనా సమయంలోనూ ప్రతిభ ఉన్నవారు ఉద్యోగాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు. కరోనా కెరీర్‌కు అడ్డం కాదంటూ నిరూపిస్తున్నారు.

Young Girl From East Godavari Got Job In Flipkart With A Huge Package

East Godavari Girl Gets Job in Flipkart: కరోనా సమయంలోనూ ప్రతిభ ఉన్నవారు ఉద్యోగాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు. కరోనా కెరీర్‌కు అడ్డం కాదంటూ నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన యువతి ఎన్‌.ఎస్‌.ఎల్‌.అపూర్వ ఫ్లిప్‌కార్ట్‌లో అధ్భుతమైన ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఏడాదికి రూ.26.57 లక్షల ప్యాకేజ్‌తో అపూర్వ ఉద్యోగం సంపాదించింది. అపూర్వ తండ్రి కృష్ణమోహన్‌ స్థానిక MPUP స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

తన కుమార్తె భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించడంపై ఆనందం వ్యక్తంచేసిన తండ్రి కృష్ణమోహన్‌.. విద్యార్థి దశ నుంచే అపూర్వ చదువులో రాణించేదని, ర్యాంకులు సాధించేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం లభించినట్లు చెప్పారు. విద్యలో రాణించే అమ్మాయిలను ప్రోత్సహిస్తే అధ్బుతాలు చేస్తారని ఈ సంధర్భంగా అభిప్రాయపడ్డారు కృష్ణమోహన్.

భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ మార్చి 2021కి చదువు పూర్తి చేస్తూనే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం సంపాదించింది అపూర్వ. కాలేజ్ యాజమాన్యం కూడా ఈ విషయంలో సంతోషంగా ఉందని అన్నారు.