Avinash Reddy
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చేతనైతే సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రజాసంబద్ధంగా నిర్వహించాలని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఎలక్షన్లను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశామని అవినాశ్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు అధికారులను తమ అధీనంలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చేతనైతే సభ్యులందరికీ నోడ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు.
ఓటమి భయంతో రైతులకు, సభ్యులకు ఓటింగ్ లేకుండా చేసి అరాచకం సృష్టిస్తున్నారని అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇలా గెలవలేమనే భయం ఉన్నప్పుడు సంఘాలు ఎన్నికలను కూడా నామినేటెడ్ పోస్టులా చేసుకుని ఉండాల్సిందని చెప్పారు.
గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఇలా హౌస్ అరెస్టులు చేయడమేంటని అవినాశ్ రెడ్డి నిలదీశారు. ఇలా ఎన్నికలను నిర్వహించడం అంటే రాజ్యాంగాన్ని కాలరాయడమేనని అన్నారు. ఇలా రాజ్యాంగాన్ని కాలరాస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు.
KA Paul: వారికో న్యాయం.. వీరికో న్యాయమా? అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్