KA Paul: వారికో న్యాయం.. వీరికో న్యాయమా? అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని అన్నారు.

KA Paul: వారికో న్యాయం.. వీరికో న్యాయమా? అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

KA Paul

Updated On : December 13, 2024 / 3:58 PM IST

Ka Paul Reaction On Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. ఇవాళ కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా?” అని కేఏ పాల్ నిలదీశారు.

అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానని తెలిపారు. బలవంతులైన రాజకీయ నేతలకు ఓ న్యాయం ఉంటే, సాధారణ వ్యక్తులు, నటులకు మరో మరో న్యాయమా అని ప్రశ్నించారు.

కాగా, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్‌ నేతృత్వంలో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్ట ప్రకారం ఫాలో అవుతున్నామని తెలిపారు.

అందుకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు: అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ రెడ్డి కామెంట్స్‌