అందుకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు: అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ రెడ్డి కామెంట్స్
అలాగే, మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు.

మీడియాతో పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇందులో తన ప్రమేయం ఏమీ ఉంటుందని ప్రశ్నించారు.
చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరని తెలిపారు. అలాగే, మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు.
మరోవైపు, తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై చర్చేమీ లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఓ వైపు సీరియస్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలంతా కలిసి అధష్ఠానంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరగాలని తెలిపారు. వాళ్లంతా లేకుండా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.
జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు