ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచే లీడర్స్‌లలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లీడర్..తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో బాంబు పేల్చారు. సంవత్సరంలోపు వైఎస్ భారతీ ముఖ్యమంత్రి కావచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారాయ. 2020, జనవరి 15వతేదీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
ఏపీ సీఎం జగన్..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆప్తుడని, అందుకే ఎన్నికల్లో సాయం చేశారని తెలిపారు. జగన్ సీఎం కాగానే విశాఖకు వెళ్లిపోవాలని అనుకున్నారని, విజయసాయిరెడ్డి ఎప్పుడూ విశాఖలోనే ఉండేవారన్నారు. మెజార్టీ కమ్మ వాళ్లే భూములు కొని ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. విశాఖలో వాళ్లు కొన్నారని తమ పార్టీకి చెందిన వాళ్లు పెద్ద లిస్టే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇటీవలే పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పోలీసు సంఘం తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. సంచలన వ్యాఖ్యలు చేస్తున్న జేసీ పార్టీ మారుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు టాక్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి దశాబ్దాలకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ వీడారు.
జేసీ టీడీలో చేరితే..కన్నా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జేసీ కుటుంబానికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయక..వారి కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను బరిలోకి దించారు. అనంతపురం లోక్ సభ అభ్యర్థిగా పవన్ రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఏ పార్టీలో చేరకపోయినా…హాట్ హాట్ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు జేసీ.
Read More : సంక్రాంతి పూట విషాదం : రాజధానిలో ఆగిన మరో గుండె