YS Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

YS Viveka Case: చంచలగూడ జైలుకు వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నారు. ఆయన ఫోనును కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు.

YS Viveka Case

YS Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. వైఎస్ వివేక కేసులో ఇవాళ ఉదయం భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, అనంతరం సీబీఐ కోర్టు తరలించారు. భాస్కర్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ఎదుట సీబీఐ అధికారులు హాజరుపర్చారు.

దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ కు అప్పగిస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. చంచలగూడ జైలుకు వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నారు. ఆయన ఫోనును కూడా అధికారులు సీజ్ చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది.

భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై వైసీపీ ఎంపీ అవినాశ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఎంపీ అవినాశ్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. వైఎస్ వివేక కేసులో మొదటి నుంచి ఎన్నో మలుపుతూ తిరుగుతూ వచ్చింది.

YS Viveka Case: హైదరాబాద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి.. వివేక కేసులో సంచలన వ్యాఖ్యలు