YS viveka case
YS viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో A4 నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారటాన్ని అనుమతించిన అంశంపై భాస్కర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హత్యకు గురి అయిన వివేకనందరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకానందరెడ్డి లైంగికరంగా వేధించారని అందుకే కక్షకట్టి సునీల్ యాదవ్ వివేకాను హత్య చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా కుటుంబంలో కూడా విభేధాలున్నాయని ప్రస్తావించారు. దీనిపై మధ్యాహ్నం మూడు గంటలకు సునీతారెడ్డి తనపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించనున్నారు. అలాగే సీబీఐ పిటీషన్ పై కూడా ఈరోజు వాదనలు జరుగనున్నారు. ఈకేసులో A1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ పిటీషన్ పై కూడా ఈరోజు వాదనలు జరుగనున్నాయి. ఇలా ఆరోపణలు, బెయిల్ రద్దు..దస్తగిరి అప్రూవర్ వంటి అంశాలపై ఈరోజు విచారణలు జరుగనున్నాయి.