YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు.

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ.. పంత్ ఎప్పుడు తిరిగొస్తాడంటే

ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ఈ కేసు విచారణలో సునీల్ సీబీఐ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించారని, ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాదులు అన్నారు. అయితే, ఈ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది.

Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

ప్రస్తుతం వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని, ఈ దశలో నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇప్పుడు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. వివేకా హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సీబీఐ. అలాగే ఈ కేసులో నిందితుడి బెయిల్‌కు వ్యతిరేకంగా వైఎస్ సౌభాగ్యమ్మ, సునీత తరఫు న్యాయవాదులు కూడా ఈ అంశంలో వాదించారు. వీళ్లంతా సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

దీనిపై స్పందించిన కోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకన్నా, సాక్షుల భద్రత, పారదర్శక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సునీల్ యాదవ్‌కు బెయిల్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.