YS Jagan Delhi Tour : జగన్‌ ఢిల్లీ టూర్..! ఈ టైమ్‌లోనే ఎందుకు? హస్తిన పర్యటన ప్లాన్ వెనుక వైసీపీ వ్యూహం ఇదేనా..

YS Jagan Delhi Tour : పార్లమెంట్ సెషన్‌ హాట్ హాట్‌గా సాగుతోంది. ఇటు ఏపీ పాలిటిక్స్ కూడా రోజుకో ఇష్యూతో హీటెక్కుతున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన అంటూ టాక్ మొదలైంది.

YS Jagan Delhi Tour

  • వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌కు వెళ్లబోతున్నారా.?
  • మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉందా.?
  • హస్తన పర్యటన ప్లాన్ వెనుక జగన్ వ్యూహమేంటి.?

YS Jagan Delhi Tour : పార్లమెంట్ సెషన్‌ హాట్ హాట్‌గా సాగుతోంది. ఇటు ఏపీ పాలిటిక్స్ కూడా రోజుకో ఇష్యూతో హీటెక్కుతున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన అంటూ టాక్ మొదలైంది. బీజేపీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చిందనే ప్రచారం రాజకీయంగా ఆసక్తిగా మారింది. మరోవైపు జగనే మోదీ, అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారని అంటున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి మోదీ, షా అపాయింట్‌మెంట్‌ తీసుకునే బాధ్యతను అప్పగించారని అంటున్నారు.

Also Read : AP Rain Alert : ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో భీకరగాలులతో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ

జగనే ఢిల్లీకి వెళ్లబోతున్నారో.? లేక బీజేపీ పెద్దలే జగన్‌ను హస్తినకు ఇన్వైట్ చేశారో.. క్లారిటీ లేదు కానీ..జగన్‌ ఢిల్లీ పర్యటన ప్రచారం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అయితే 2024 ఎన్నికల తర్వాత జగన్ మొదటిసారి ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కాబోతుండటం పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్‌ అవుతోంది. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే కేంద్ర మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ మద్దతు కోరేందుకే ఢిల్లీ నుంచి జగన్‌కి ఆహ్వానం అందినట్లు ఇన్‌సైడ్‌ టాక్ నడుస్తోంది.

డీలిమిటేషన్ జరిగితే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు, జనాభా ప్రాతిపదిక, పరిపాలనా అవసరాలు వంటి అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్‌కు వైసీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. పార్లమెంట్‌లో కూడా ఈ అంశంపై సానుకూలంగానే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక డీలిమిటేషన్‌ విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ తన ఒపీనియన్‌ను కేంద్రానికి తెలియజేసే అవకాశముంది.

రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఢిల్లీ పెద్దల భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఎదుర్కొంటున్న అంశాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రధాని, హోంమంత్రితో చర్చించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ, బీజేపీ సంబంధాలు.. కొత్తవి కావు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జగన్ ఘర్షణ రాజకీయాలను కాకుండా, సహకార ధోరణినే ఎక్కువగా అనుసరించారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, పోలవరం, విభజన హామీలు వంటి అంశాల్లో కేంద్రాన్ని కలుస్తూనే.. పార్లమెంట్‌లో అనేక కీలక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేని సమయంలో వైసీపీ సపోర్ట్‌గా నిలిచింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులకు వైసీపీ ఎంపీలు ఓటేశారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం.. బీజేపీ, వైసీపీ బలమైన బంధానికి ఉదాహరణగా పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిస్తే.. అది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయడం ఖాయం. ఒకవైపు బీజేపీ రాష్ట్రం, కేంద్రంలో టీడీపీతో కలిసి అధికారంలో ఉండటం.. మరోవైపు జాతీయ స్థాయిలో జగన్‌తో రాజకీయ చర్చలు కొనసాగడం.. ఈ పరిణామాలను మిగిలిన పక్షాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఎప్పుడూ ఏ కూటమిలోనూ పూర్తిగా కలిసిపోలేదు. అవసరమైన సందర్భాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తూనే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నామని చెబుతోంది ఫ్యాన్ పార్టీ. మరి ఈసారి జగన్ ఢిల్లీ పర్యటన కూడా వ్యూహంలో భాగమా.? లేక బీజేపీ, వైసీపీ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకబోతోందా.? అనేది వేచి చూడాలి.