ఈ 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో ప్రచార సభ ఉంటుంది.

Cm Jagan Election Campaign

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాసేపట్లో అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్ లో మొదటి ప్రచార సభ నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి.గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్‌లో సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో ప్రచార సభ ఉంటుంది.

రాయి దాడి కేసులో స్టేట్మెంట్..
సీఎం జగన్‌పై కొన్ని రోజుల క్రితం జరిగిన దాడి కేసులో న్యాయమూర్తి ముందు నిందితుడు సతీశ్‌‌ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

నిందితుడు స్టేట్మెంట్ రికార్డు చేయాలని కోర్టులో పీపీ వాదించారు. సతీశ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయవద్దంటూ అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోసారి ఇవాళ న్యాయమూర్తి ముందు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.

Also Read: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల