×
Ad

YS Jagan : వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు

YS Jagan : వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద

YS Jagan

YS Jagan : వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తున్నారు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.

ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. దారిపొడవునా జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత కూడా జగన్ పర్యటన సాగిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.

పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెం చేరుకున్న వైఎస్‌ జగన్‌ కు కార్యకర్తలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, వృద్ధులు తరలి వచ్చారు. ఇదిలాఉంటే.. ఆకునూరు సెంటర్ కు చేరుకున్న జగన్ మోహన్ రెడ్డిని కల్లుగీత కార్మికులు కలిశారు. తమ కష్టాలను చెప్పుకున్నారు.

జగన్ పర్యటనపై ఆంక్షలు..
వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుతి ఇచ్చారు. అంతేకాదు.. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటనకు రావొద్దని మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.