YS Jagan
YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ భారీగా సంతకాల సేకరణ చేపట్టింది. రెండు నెలల్లో కోటికి పైగామంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. అన్ని జిల్లాల నుండి తాడేపల్లి చేరుకున్న సంతకాల పత్రుల వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆ వాహనాలు లోక్ భవన్‌కు చేరుకున్నాయి.
లోక్ భవన్ దగ్గరకు వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు చేరుకున్నాయి. లోక్ భవన్ వద్ద వాహనాలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పరిశీలించారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. లోక్ భవన్‌కు 40 మందికి, 10 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, డీజేలు, డ్రోన్స్, జనాలు గుమ్మిగూడటం చేయొద్దని పోలీసులు తెలిపారు.
ఇవాళ సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నర్‌కు కోటి సంతకాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. గవర్నర్‌తో భేటీకి ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.