Chandrababu Slams YS Jagan
Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ నాటికి జగన్ మాజీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికో పోతారు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది అని చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ కే వాయిదా వేసిందన్నారు చంద్రబాబు. స్థానిక సుపరిపాలన – ఆత్మ గౌరవం – ఆత్మ విశ్వాసం డిక్లరేషన్ ను తెలుగుదేశం ప్రకటిస్తోందని, ఈ డిక్లరేషన్ ను తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
”నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్ లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరతాం. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 5శాతం నిధులు పంచాయితీలకు కేటాయిస్తాం. రానున్న ఐదేఏళ్లలో ఈ నిధులను 10శాతానికి పెంచుతాం.
గ్రామంలో ఏ పని జరగాలన్నా సర్పంచ్, పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. తమకు సేవ చేసేందుకు ప్రజలు సర్పంచ్ లను ఎన్నుకుంటే, తన సేవ కోసం జగన్ వాలంటీర్లను నియమించారు. వాలంటీర్లు కూడా సర్పంచ్ ల ఆదేశాలతో ప్రజా సేవ చేయాలి కానీ జగన్ సేవ చేయకూడదు.
Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్
ప్రజాస్వామ్యంలో స్థానిక పాలన గౌరవాన్ని జగన్ తగ్గించేశారు. పంచాయతీల వ్యవస్థ ఎదుగుదలను ఎక్కడికక్కడ నరికేశారు. సర్పంచ్ లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతాం. ఎంపీపీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు 15వేలు.. జెడ్పీ చైర్మన్, మేయర్ ల గౌరవ వేతనాన్ని రూ. 50వేలకు పెంచుతాం.
తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోంది. తల్లి – చెల్లి వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధo? ఏదో రకంగా ఇతరులపై బురద చల్లేసి బతకటమూ ఓ రాజకీయమా? పెన్షన్ల పెంపు అంటూ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి రాజకీయ పార్టీలను విమర్శిస్తారా? అంటూ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?