జమిలి ఎన్నికల నిర్వహణ ఎవరి చేతుల్లోనూ లేదు: జగన్

ఇసుక, మద్యం ఇలా ఎక్కడ చూసినా దోపిడినే జరుగుతోందని జగన్ ఆరోపించారు.

YS JaganMohan Reddy

ఎన్నికలు ఉన్నప్పుడే ఎన్నో హామీలు ఇస్తారని, ప్రజలపై ప్రేమ చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అన్నారు. ఇప్పుడు మాత్రం ప్రశ్నించే వారిని ప్రభుత్వ పెద్దలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.

ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కప్పం కట్టనిదే ఏపీలో పనులు జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దోచుకునే పంచుకు తినే మాఫియా నడుస్తోందని అన్నారు.

ఇసుక, మద్యం ఇలా ఎక్కడ చూసినా దోపిడినే జరుగుతోందని జగన్ ఆరోపించారు. ప్రజల ఆశలతో చెలగాటం ఆడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడుతున్నారని అన్నారు. ఎక్కడ ఎవరికి ఉచిత ఇసుక ఇస్తున్నారని నిలదీశారు.

రాష్ట్ర ఆదాయం సున్నా అని చెప్పారు. మార్పుల పేరుతో స్కామ్‌లకు తెరదీస్తున్నారని అన్నారు. ఇసుకపై ఎంతో ప్రచారం చేశారని, ఇప్పుడు లారీ ఇసుక రూ.65 వేలు ఉందని అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే రేట్లను దారుణంగా పెంచేశారని తెలిపారు. ప్రజల మీద ఇసుక భారం మోయలేనంతగా ఉందని అన్నారు.

జగన్ కామెంట్స్‌

  • అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తిరగబడతారు
  • ప్రజలు తిరగబడితే చంద్రబాబు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు
  • జమిలి ఎన్నికల నిర్వహణ ఎవరి చేతుల్లో లేదు
  • జమిలి ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉండటమే మన చేతుల్లో ఉంది
  • అందుకు ప్రిపేర్ గా ఉండాలని పార్టీ శ్రేణులకు చెప్పాం
  • Evm లపై మా ఫైట్ కొనసాగుతోంది
  • ఒంగోలులో evm లపై హైకోర్టులో పిటిషన్ వేశాం
  • ఈసీ వీవీ ప్యాట్లు, evm లలో ఓట్లు మ్యాచ్ చేయవచ్చు కదా
  • ఇలా చేస్తే దేశంలో ఉన్న అందరి డౌట్లు పోతాయి కదా
  • మా ముందు వెరిఫై చేయాలని కోరాం
  • ఈసీ కి ఏ కల్మషం లేకపోతే వెరిఫై చేయవచ్చు కదా
  • హైకోర్టులో ఈసీ మాత్రం సుప్రీం మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని చెప్పింది
  • సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ను వక్రీకరిస్తున్నారు
  • మాక్ పోలింగ్ వల్ల ఏం లాభం ఉంటుంది
  • ఎన్నికల తర్వాత మాక్ పోలింగ్ వల్ల ఏం ఉపయోగం
  • ఆరు నెలలు ఇలానే వదిలేస్తే వీవీ ప్యాట్ల మీద ఇంకు పోతుందని ఎదురు చూస్తున్నారు
  • 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల్లో వాడుతున్నారు

Jharkhand Elections 2024: జార్ఖండ్‌లో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం.. బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..