Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసరపల్లి వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం పంపారు. ఆ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.
మొత్తం 104 కుటుంబాలను ఇందుకు ఎంపిక చేశారు. ఆ కుటుంబాలలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాలు కూడా ఉన్నాయి. కాగా, ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాగా, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు రాత్రి తిరుమలలో బస చేస్తారు. తదుపరి రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఏపీలోని కూటమి పార్టీలు మంగళవారం సమావేశం అవుతాయి. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియను చేపడతారు.
Also Read: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. అన్ని విషయాలు బయటకు వస్తాయి: జస్టిస్ చంద్ర ఘోష్