YS Jagan : 5న తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

YS Jagan

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (ఆగస్టు 5న) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 9.30గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారు.

Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..

తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తారు. అంతేకాక.. అక్కడేఉన్న పొగాకు రైతులతో నేరుగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు నేరుగా తేలుసుకుంటారు.

బుధవారం ఉదయం 9.30గంటల బయలుదేరనున్న జగన్.. ఉదయం 10.30గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం  మధ్యాహ్నం దేవరపల్లి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.