YS Sharmila: అందుకే నేను ఏపీకి వచ్చి పోరాడుతున్నాను: షర్మిల

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు.

YS Sharmila

రాయలసీమకు ముఖ్యమైన హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం వైఎస్సార్ పూర్తి చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పది శాతం హంద్రీనీవా ప్రాజెక్టు పనులను కూడా చంద్రబాబు, జగన్ కు పూర్తి చేయడం చేతకాలేదని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు. ఏపీ తన పుట్టినిల్లని చెప్పారు. ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడకు వచ్చానని తెలిపారు. టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీకి బానిసలుగా మారాయని అన్నారు. తనపై అనేక దాడులు చేస్తున్నారని తెలిపారు.

గతంలో వైసీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా తాను అండగా నిలబడ్డానని షర్మిల అన్నారు. జగన్‌కు అధికారం వచ్చాక మనిషే మారిపోయారని చెప్పారు. ఏపీ ప్రజలు జగన్ ను నమ్మి ఓటు వేస్తే.. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని తెలిపారు. తనపై దాడులు చేసినా… హింసించినా…కుటుంబాన్ని చీల్చినా….ప్రజల కోసం పోరాడతానని తెలిపారు.

TDP-Janasena: పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం?