కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుక వీడియోను షేర్ చేసిన వైఎస్ షర్మిల.. ఎవరెవరు పాల్గొన్నారంటే..

వైఎస్ రాజారెడ్డి - అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలను ట్విటర్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షేర్ చేశారు.

YS Sharmila son marriage

YS Sharmila son marriage : : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి – అట్లూరి ప్రియల వివాహ వేడుక ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. తాజాగా తన కుమారుడి వివాహ వేడుక వీడియోను వైఎస్ షర్మిల తన ఎక్స్ (ట్విటర్ )ఖాతాలో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.

Also Read : YS Rajareddy Engagement : మేనల్లుడి నిశ్చితార్థం వేడుకలో వైఎస్ జగన్.. ఫోటోలు

వైఎస్ షర్మిల.. కుమారుడి వివాహ వేడుక వీడియోతో పాటు నూతన జంటకు ఆశీర్వచనాలు అందించారు. అత్యంత అందమైన జంట, దాంపత్య ఆనందంలోకి అడుగు పెట్టింది. నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లు నేను అనుభూతి చెందానని షర్మిల ట్వీట్ లో పేర్కొంది. గంభీరమైన, ఇంకా అద్భుతమైన ఈ సందర్భం మన హృదయాలపై శాశ్వతంగా నిలిచిపోతుంది. ఒకరికొకరు ఆనందంతో అనంతమైన ప్రేమ, అద్భుతమైన జీవితాన్ని గడపాలని నేను ఈ జంటను అశీర్వదించాను అని షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు.