YS Viveka Case : సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి ..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు చంచల్ గూడ జైలుకే. వివేకా కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఈకేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎర్రగంగిరెడ్డి కూడా చంచల్ గూడ జైలుకే చేరనున్నారు.

Erra Gangireddy ..CBI Court YS Viveka Case

YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టులో లొంగిపోయారు. మే 5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోకుంటే సీబీఐ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం (మే 5,2023) హైదరాబాదులోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో సీబీఐ కోర్టు ఎర్ర గంగరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.  లొంగిపోవటం జరిగింది స్పందిస్తు ఎర్రగంగిరెడ్డి తన న్యాయవాదితో చర్చించానని..ఆయన సలహా మేరకు..హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లొంగిపోతున్నానని తెలిపారు.

కాగా 2019లో జరిగిన వైఎస్ వివేకా హత్యకేసులో ఏ1 నిందితుడుగా ఉన్న గంగిరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా విచారణ కోసం అరెస్ట్ చేసింది. ఆ తరువాత బెయిల్ కోసం అభ్యర్థిస్తు వేసిన పిటీషన్ పై స్పందిన పులివెందుల కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పటినుంచి గంగిరెడ్డి బయటే ఉన్నారు. ఆ తరువాత వివేకా కుమార్తె సునీతారెడ్డి సీబీఐ విచారణకు కోరటం.. ఏపీ నుంచి ఈకేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని సుప్రీంకోర్టును కోరటంతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ గంగిరెడ్డి మాత్రం బెయిల్ లభ్యమైనప్పటినుంచి బయటే ఉన్నారు. ఆ తరువాత ఈకేసు దర్యాప్తులో పలు కీలక పరిణామాలు జరిగాయి. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో పాటు పలు అరెస్ట్ లు జరిగాయి.

YS Viveka Case : సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎర్రగంగిరెడ్డి .. లొంగిపోతారా? పారిపోతారా?

ఈక్రమంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వులు ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి మే5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లేదంటే అరెస్ట్ చేయాలని సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎట్టకేలకు వేరే దారిలేక లొంగకపోతే అరెస్ట్ చేస్తారనే ఆలోచనతో తన న్యాయవాది సలహా మేరకు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు.

ఈకేసు పులివెందుల కోర్టులో విచారణలో సిట్ దర్యాప్తులో ఉండగా ఎర్రగంగిరెడ్డికి బెయిల్ వచ్చేలా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిలు గట్టిగా యత్నించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. ఈకేసు సిట్ దర్యాప్తులో ఉండగా సిట్ ఛార్జ్ షీట్ ను 90 రోజుల్లో దాఖలు చేయకపోవడంతో డీఫాల్ట్‌గా రూ.లక్షన్నర షూరిటీతో గంగిరెడ్డి బెయిల్‌ లభించింది. గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. 2019లో వివేకా హత్య జరగ్గా.. ఈ కేసులో గంగిరెడ్డి అరెస్టు అవ్వటం..90 రోజుల్లోపు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో జూన్ 27నే గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది పులివెందుల కోర్టు.