CBI Restarts Investigation: కడపకు సీబీఐ అధికారులు.. నేటి నుంచి వివేకా హత్యకేసు విచారణ!

మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి వచ్చిన సీబీఐ అధికారులు.. వివరాలను సేకరిస్తున్నారు.

Ys Vivekananda Reddy Murder Case Cbi Investigation From Today

YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి వచ్చిన సీబీఐ అధికారులు.. వివరాలను సేకరిస్తున్నారు.

ఇప్పటికే పలు దఫాలుగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సాగగా.. నేటి నుంచి మరోమారు కేసు విచారణ ప్రారంభించనున్నారు. ఇవాళ(07 జూన్ 2021) పలువురు కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది.

రెండేళ్ల క్రితం హత్య కేసులో పలువురిని విచారించిన సీబీఐ.. గతేడాది కొందరిని విచారించింది. విచారణకు వచ్చిన అధికారులలో కొందరికి కరోనా రావడంతో విచారణ నిలిచిపోయింది. ఏడు నెలల తరువాత మళ్లీ విచారణ జరిపేందుకు అధికారులు వచ్చారు. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. మరోసారి కేసులోని కీలక వ్యక్తులను విచారించబోతున్నారు.