వారి ఖాతాల్లోకి రూ.10వేలు వేసిన జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ వాహనమిత్ర రెండో విడత సాయం

  • Publish Date - November 9, 2020 / 04:29 PM IST

ysr vahana mitra second phase: వైఎస్ఆర్ వాహనమిత్ర రెండో ఏడాది రెండో విడతను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది రెండో విడతలో 11వేల 501మంది లబ్ది పొందారు. ఈ ఏడాది 2లక్షల 61వేల 975మంది లబ్ది చేకూరిందని మంత్రి కొడాలి నాని చెప్పారు. వైఎస్ఆర్ వాహనమిత్ర కింద రెండేళ్లకు రూ.510 కోట్లు అందించామని మంత్రి తెలిపారు. 10వేలు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

” రాష్ట్రంలో రెండో విడత వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 2 లక్షల 61,975 మందికి వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా లబ్ధి చేకూరనుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రెండేళ్లకి కలిపి రూ.510 కోట్లు పేదలకు అందిస్తున్నాం. గతేడాది కంటే 40వేల మందికి ఈ ఏడాది లబ్ధి చేకూరింది. లబ్ధిదారులందరికీ రూ.10 వేలు అకౌంట్‌లో నేరుగా జమ అవుతాయి” అని మంత్రి కొడాలి నాని చెప్పారు.


https://10tv.in/cm-kcr-announce-compensation-for-flood-victims/
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ యజమాని కమ్‌ డ్రైవర్‌కు రూ.పది వేలు చొప్పున అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. రూరల్‌ జిల్లా పరిధిలో అయితే ఎంపీడీవో కార్యాలయంలో, నగర పరిధిలోనివారైతే వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, రుణం లేని బ్యాంకు పాస్‌బుక్‌ మొదటిపేజీ, కుల ధ్రువీకరణపత్రం అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద రూ.10వేలు అందించారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు.