వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సీఆర్డీఏ ప్రొసీడింగ్స్..!

సీఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.

Ysrcp Office : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సీఆర్డీఏ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టింది. సీఆర్డీఏ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. వైసీపీ తరుపున వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సీఆర్డీఏ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు తెలిపారు వైసీపీ న్యాయవాది. చట్టాన్ని మీరు మితిమీరి ఉపయోగించుకోవద్దని వాదనలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని ఏపీ హైకోర్టు.

తాడేపల్లిలో వైసీపీ నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయానికి సంబంధించి కూల్చివేతకు సీఆర్డీఏ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. చట్టాన్ని మీరి ఎక్కడా వ్యవహరించొద్దని కోర్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. కట్టడాన్ని కూల్చివేస్తామని, నిర్మాణాలు చేపట్టొద్దని 2 రోజుల క్రితమే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ కు సంబంధించి వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించి సీఆర్డీఏ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read : రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

ట్రెండింగ్ వార్తలు