Badvel Election : సీఎం జగన్ మెజార్టీని క్రాస్ చేసిన డా.సుధ

ఏపీ సీఎం వైఎస్ జగన్ సాధించిన మెజార్టీని సైతం ఆమె కాస్ చేశారు. డాక్టర్ సుధాకు  90 వేల 228 ఓట్ల మెజార్టీ వచ్చి ఘన విజయం సాధించారు.

Dr.sudha

YSRCP Candidate Dasari Sudha : బద్వేల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచింది. ఎంతలా అంటే..ఆ గాలికి విపక్ష పార్టీలు కనుచూపు మేర కనిపించలేదు. తాము గెలవకపోయినా..వైసీపీ మెజార్టీని తగ్గిస్తామని చెప్పిన ప్రత్యర్థి పార్టీలు కనీసం ప్రభావం చూపించలేకపోయాయి. ఆ పార్టీలను బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు. వైసీపీ పార్టీ అభ్యర్థి డా.సుధ వైపే మొగ్గు చూపారు. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఆమెకు పడడంతో భారీ మెజార్టీ సాధించి..విజయం సాధించారు.

Read More : Woman Fraud : మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసిన యువతి

ఒక్కమాటలో చెప్పాలంటే..రికార్డు బద్ధలు కొట్టారని చెప్పవచ్చు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సాధించిన మెజార్టీని సైతం ఆమె కాస్ చేశారు. డాక్టర్ సుధాకు  90 వేల 228 ఓట్ల మెజార్టీ వచ్చి ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ 90 వేల 110 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44 వేల 734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే..ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సుధ…భర్త కంటే దాదాపు రెట్టింపు మెజార్టీని కైవసం చేసుకున్నారు. దాసరి సుధకు మొత్తం లక్షా 11 వేల 710 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజీపీ క్యాండిండేట్ కు కేవలం 21 వేల 621, కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల పైచిలకు ఓట్లు వచ్చాయి.

Read More : Gold Sweets : బంగారు మిఠాయిలు…కేజీ ధర ఎంతో తెలుసా?

2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలబడినా…ఆశించినంత ఫలితాలు రాబట్టలేదు. మొత్తంగ వైసీపీ ఖాతాలో మరో నియోజకవర్గం వచ్చి చేరింది.