ఓ వైపు అరెస్టులు..ఇంకోవైపు అధినేత టూర్లపై రచ్చ..ఇంకోవైపు లిక్కర్ మరకలు..లేటెస్ట్‌గా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్..ఆ తర్వాత లిక్కర్ కేసులో పెద్ద టార్గెట్ అంటూ లీక్స్..ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ లీడర్లు, క్యాడర్ కాస్త సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పల్నాడు, చిత్తూరులో అధినేత పర్యటనల సందర్భంగా ఉన్న జోష్..ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ తర్వాత నేతల్లో ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదట. అధినేత టూర్లు కొనసాగినంత కాలం కార్యకర్తలు, నేతలు యాక్టీవ్‌గా ఉంటున్నారట.
జగన్ బెంగళూరుకు వెళ్లిపోగానే లీడర్లు కామ్ అయిపోయారని అంటున్నారు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో జగన్ పేరును ఇప్పటికే సిట్ చార్జిషీట్‌లో పెట్టడంతో పాటు..ఆయనను అరెస్ట్ చేస్తారన్న లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సమావేశానికి రెడీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ ముఖ్యనేతలతో..పార్టీకి అతి ముఖ్యంగా ఉన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మీద ఇప్పుడు అందరి చూపు ఉంది. గవర్నర్‌ను కలిసి..వైసీపీ నేతల అరెస్టులు, లిక్కర్ కేసు వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీని షప్లింగ్ చేసింది వైసీపీ. గతంలో అందులో చాలా మంది సీనియర్లు ఉండేవారు. ఇప్పుడు వారి ప్లేస్‌లో కొత్తవారికి చోటు ఇచ్చింది. అంతేకాదు ప్రతీ జిల్లా నుంచి కనీసం ఇద్దరికి అవకాశం దక్కింది. దాంతో పీఏసీ అంటే పార్టీలో అతి ముఖ్యమైన లీడర్ల టీమ్‌గా మారింది. ఇక పీఏసీ మొదటి మీటింగ్‌ను వైసీపీ ఆ మధ్యనే నిర్వహించింది. ఇప్పుడు మరో సమావేశానికి రెడీ అయింది. దాంతో ఈ సారి సమావేశం ఎజెండా కాస్త సీరియస్‌గానే ఉంటుందని అంటున్నారు.
సమావేశం కీలక ఎజెండా ఇదేనా?
ఏపీలో అధికార కూటమి వైసీపీని పెద్దఎత్తున టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేతలంతా కేసులు, జైల్లు, కోర్టుల చుట్టే తిరుగుతున్నారు. లేటెస్ట్‌గా లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్‌గా ఉంది. ఆ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. దాంతో ఇక లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ మీద కూడా కేసులు పెడతారని.. అరెస్టు దాకా వ్యవహారం వెళ్లొచ్చన్న ప్రచారం నడుస్తోంది. దాంతో ఈ సమావేశం కీలక ఎజెండా అదేనన్న చర్చ జరుగుతోంది.
ఒకవేళ జగన్ అరెస్టు అయితే పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి..భవిష్యత్ ప్రణాళిక ఏంటనే దానిపై పీఏసీలో డిస్కస్ చేస్తారని టాక్. అంతే కాదు వైసీపీ ఉద్యమ పంధా మీద కూడా చర్చిస్తారట. ఈ సమావేశంలో పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారని టాక్. పీఏసీ వైసీపీలో మరింత కీలకం కాబోతోందని..జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే వైసీపీని నడిపించే బాధ్యత పీఏసీకి ఇవ్వబోతున్నారట. ఏ ఒక్కరి మీద డిఫెండ్ కాకుండా ఏ ఒక్కరికీ నాయకత్వ బాధ్యతలు అప్పగించకుండా అంతా కలసి పనిచేసేలా పీఏసీని సిద్ధం చేస్తారని అంటున్నారు. వైసీపీ నిరసనలు, ఆందోళనలు అన్నీ కూడా రానున్న రోజుల్లో పీఏసీనే చూసుకుంటుందట.
ఇప్పటికే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు జగన్. జగన్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ..పాదయాత్ర షెడ్యూల్‌ను కాస్త ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. అంతకంటే ముందుగా జిల్లాల పర్యటన పెట్టుకుని నిత్యం ప్రజల మధ్యలో ఉండేలా ప్రిపేర్ అవుతున్నారట. త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారట. ఆ సభకు సమరభేరి సభ అని నేమ్ కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ కీలక అంశాలపై బెంగళూర్ వేదికగా సుదీర్ఘ మంతనాలు జరిపారట జగన్.
ఇప్పుడు సరికొత్త ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. కూటమిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలను ఆకర్శించడం ఒక ప్లాన్ అయితే..కాంగ్రెస్ నుంచి చేరికలను ప్రోత్సహించబోతున్నారట. వీటన్నింటిపై పీఏసీలో డిస్కస్ చేసి కీలక నిర్ణయాలే తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ భవిష్యత్ ప్రణాళిక ఏంటో..జగన్ వ్యూహమేంటో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.