Ambati Rambabu
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రాసుకున్న ‘రెడ్ బుక్’ అమలుపైనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మ్యానిఫెస్టో అమలుపై యంత్రాంగం పని చేయడం లేదని చెప్పారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయని, వైఎస్సార్ విగ్రహాలను ధ్వసం చేస్తున్నారని అన్నారు.
ఏపీలో ప్రమాదకరమైన ధోరణి ఉందని చెప్పారు. జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారని తెలిపారు. గతంలో రఘురామ కృష్ణరాజు వైసీపీలో ఉన్నారని, అప్పట్లోనూ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. అప్పట్లో రఘురామను అరెస్ట్ చేశాక గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారని అన్నారు.
సుప్రీంకోర్టుకు కూడా రఘురామ వెళ్లారని, బెయిల్ వచ్చిందని చెప్పారు. అది జరిగి మూడేళ్లు అయిందని, ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చని అన్నారు. 11వ తేదీన జగన్‌పై కేసు పెడితే 10వ తేదీన లీగల్ ఒపీనియన్‌కు పంపించారని చెప్పారు. దీన్ని పోలీసు అధికారులు పరిశీలించుకోవాలని అన్నారు. మాజీ సీంఎంతో పాటు ఐపీఎస్, మహిళా డాక్టరుపై కేసులు పెడుతున్నారని తెలిపారు.
Also Read: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు