Chandrababu Naidu : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు సమక్షంలో భారీగా చేరికలు

6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

YSRCP MLAs Join TDP

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్ నెలకొంది. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు భారీగా టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి దంపతులు (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు (ఉదయగిరి) చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా తెలుగుదేశంలో చేరారు.

Also Read : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు సైకిల్ ఎక్కారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నేతలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. కాగా, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సైతం టీడీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read : కేంద్రంలో మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి : సీపీఐ రామకృష్ణ