Ysrcp Mp Balasouri Met Central Ministers
రఘురాం కృష్ణం రాజుపై వైసీపీ మరో బాణాన్ని వదిలింది. రఘురాం భేటీ అయిన మంత్రులతో అంటే ముగ్గురు కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. లోక సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, సదానంద్ గౌడ, రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిపారు. రఘురాం ఢిల్లీ వచ్చి వెళ్లిన తర్వాత వారినే కలవడం చర్చనీయాంశంగా మారింది.
రఘరాం కృష్ణం రాజు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడంపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీలో జరుగుతున్న అంశాలను కేంద్ర మంత్రులతో చర్చించి రక్షణ కావాలని రఘురాం అడిగారు. దీనిపై బాలశౌరి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వైసీపీకి సంబంధించిన అంశం.. ఎంపీగా బాలశౌరి లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సమస్యను క్లియర్ చేసేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read:గుంటూరు యువతి నగ్న వీడియోల కేసు.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న వాసిరెడ్డి పద్మ