×
Ad

Vijayasai Reddy : జిన్నా టవర్ పేరు మార్పు కోరే బదులు ప్రత్యేక హోదా అడగండి

ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

  • Published On : January 1, 2022 / 07:00 PM IST

Vijayasai Reddy

Vijayasai Reddy : ఏపీ బీజేపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసే బదులు… ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిధుల కోసమో లేక వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దనో తమ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తే మంచిదని ఏపీ బీజేపీ నేతలకు విజయసాయి రెడ్డి హితవు పలికారు.

Whatsapp Payment: వాట్సాప్ ద్వారా మీ బ్యాంకు బ్యాలన్స్ ఇలా తెలుసుకోండి

కాగా, వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) పేరులో కింగ్ ఎవరు? జార్జ్ ఎవరు?… అని ప్రశ్నించిన బీజేపీ నేతలు ఆ పేరు మార్చాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరులోని టవర్ కు దేశద్రోహి జిన్నా పేరును పెడతారా?… అంటూ మండిపడ్డారు. జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.