MP Vijayasai Reddy : వాటా ఎందుకివ్వరు? తిరుమల శ్రీవారిని కూడా వదల్లేదు.. కేంద్రంపై విజయసాయిరెడ్డి ఫైర్

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

MP Vijayasai Reddy : కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ద్రవ్యోల్బణ్యాన్ని అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడిందన్నారు. ఇప్పటికైనా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి.

”నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తీవ్రంగా ఉంది. ప్రజల సామాజిక, ఆర్థిక రక్షణ బాధ్యత కేంద్రానిదే. బొగ్గు, నూనె ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ద్రవ్యోల్బణ్యాన్ని అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది. నిత్యవసర వస్తువుల ధరల తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించాలి” అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

నా లెక్క ప్రకారం ద్రవ్యోల్బణం అంటే చట్టబద్దత లేని పన్ను. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ఉల్లంఘనే. 2001లో లక్ష రూపాయలు.. నేడు కేవలం రూ.27వేలకు సమానం. 2001తో పోల్చితే ఇదీ రూపాయి విలువ. ధరల తగ్గించడం ద్వారా సాంఘిక, ఆర్థిక భద్రత కల్పించి జీవన ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత కేంద్రానిదే.

vijaya sai reddy: చంద్ర‌బాబు నాకు బంధువు.. అన్న వ‌రుస‌: విజయసాయిరెడ్డి

ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే. జర్మనీ, యూకే, యూఎస్ లో ద్రవ్యోల్బణ్యం ఉంది కాబట్టి మన దగ్గరా ద్రవ్యోల్బణం ఉండాల్సిన అవసరం లేదు. మన పొరుగు దేశాల్లోనూ ద్రవ్యోల్బణ్యం ఉన్న మాట వాస్తవమే. అన్ని వస్తువులు, అన్ని అంశాలు జీఎస్టీలో కవరయ్యాయి. చివరకు తిరుమల దేవుడిని కూడా వదల్లేదు. ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాను. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం స్పందించలేదు. బీజేపీ ఎంపీలందరూ తిరుమల వెళ్తారు. దేవుడిని ప్రార్థిస్తారు. కానీ, దేవుడిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చారు.

ట్రెండింగ్ వార్తలు