వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డికి బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

వైసీపీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు.

YSRCP Office Demolition at Tadepalli : వైసీపీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేస్తుంది. ఈ మేరకు శుక్రవారం సీఆర్డీయే ప్రొసీడింగ్స్ ఇచ్చింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో భవనాన్ని సీఆర్డీయే అధికారులు దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు. ప్రభుత్వ చర్యపై వైసీపీ మండిపడుతుంది. హైకోర్టు ఆదేశాలుసైతం బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలోకి పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్..! ఎవరీ కృష్ణతేజ..

గత కొద్దిరోజుల క్రితమే సీఆర్డీయే అధికారులు వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఇరిగేషన్ కు సంబంధించిన స్థలంలో  భవన నిర్మాణం జరుగుతుంది.. ఇందుకు అనుమతులు లేవని నిర్మాణ పనులను అధికారులు అడ్డుకున్నారు. భవన నిర్మాణ పనులు నిలిపివేయడంతోపాటు నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తిగా కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కూల్చివేతలకు సంబంధించి సీఆర్డీయే అధికారులు ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం హైకోర్టులో వైసీపీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో రూల్స్ కు విరుద్ధంగా వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Also Read : రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను వైసీపీ తరపు న్యాయవాదులు సీఆర్డీయేకు పంపించారు. అయితే, భవన నిర్మాణం కచ్చితంగా రూల్స్ కు విరుద్ధంగా కొనసాగుతుందని పేర్కొంటున్న సీఆర్డీయే అధికారులు.. వారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను ఫాలో చేస్తూ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చేందుకు శనివారం తెల్లవారు జామున 5.30గంటలకు భవన నిర్మాణం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం భవనం ఫిల్లర్లు పూర్తయ్యాయి, మొదటి అంతస్తు స్లాబ్ కు సిద్ధంగా ఉంది. ఉదయాన్నే పెద్దమొత్తంలో బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు తీసుకొచ్చి అధికారులు దగ్గరుండి భవనం ఫిల్లర్లు, ఇతర కట్టడాలను కూల్చివేయిస్తున్నారు. సీఆర్డీయే అధికారుల తీరును వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంది. కచ్చితంగా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ధిక్కారణకు సీఆర్డీయే అధికారులు పాల్పడుతున్నారని, హైకోర్టుకు ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు వైసీపీ తరపున న్యాయవాదులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు