YCP 9th List : వైసీపీ 9వ జాబితా విడుదల.. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీలకు కొత్త ఇంచార్జులు

వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం (మార్చి 1న) వెల్లడించింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇంఛార్జులను నియమించింది.

YCP 9th List : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇదివరకే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం (మార్చి 1న) వెల్లడించింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇంఛార్జులను నియమించింది.

Read Also : హైదరాబాద్‌లో హై అలర్ట్.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తం.. తనిఖీలు..

రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైసీపీ ప్రకటించింది. అందులో ప్రధానంగా నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జ్‌గా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్‌గా ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)‌‌, మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జ్‌గా మురుగుడు లావణ్య పేర్లను ప్రకటించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించిన వైసీపీ తాజాగా ఆ స్థానంలో కొత్త మార్పు చేసింది.

మంగళగిరిలో జరిగిన కీలక సమావేశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

ysrcp released 9th list

వైసీపీ 9వ జాబితా విడుదల :

  • నెల్లూరు ఎంపీ – వేణుంబాక విజయసాయిరెడ్డి
  • కర్నూలు – ఎండి ఇంతియాజ్
  • మంగళగిరి – మురుగుడు లావణ్య

Read Also : Harish Rao Comments : అందుకే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారు : హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు