హైదరాబాద్ నుంచి రహస్యంగా వస్తుండగా వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటికే కడప ఎస్పీని స్టేట్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు.

Varra Ravindra Reddy : కడప జిల్లా పులివెందుల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీంద్రా రెడ్డి.. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు తనకు తెలిసిన వారి దగ్గర తలదాచుకున్నాడు. హైదరాబాద్ నుంచి రహస్యంగా కడపకు వస్తుండగా.. పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి కర్నూలు జిల్లా చెక్ పోస్టు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రా రెడ్డిని కడపకు తరలిస్తున్నారు పోలీసులు.

వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డి.. దాదాపు నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులను డైవర్ట్ చేసి తిరుగుతున్నారు. నాలుగు రోజుల నుంచి అతడి కోసం జల్లెడ పట్టిన పోలీసు బృందాలు.. ఎట్టకేలకు కర్నూలు జిల్లా చెక్ పోస్ట్ దగ్గర సీసీ ఫుటేజీ ఆధారంగా వర్రా రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం భారీ బందోబస్తు మధ్య రవీంద్రారెడ్డిని కడపకు తరలిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.

41ఏ నోటీసులు ఇచ్చి వెళ్లే క్రమంలో.. అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడంతో మీడియా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి.. నాలుగు రోజుల కిందట ఎస్కేప్ అయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటికే కడప ఎస్పీని స్టేట్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. సీఐ తేజోమూర్తిని కూడా సస్పెండ్ చేశారు. సంచలనంగా మారిన కేసులో ఇదొక బిగ్ అప్ డేట్ గా చెప్పొచ్చు.

Also Read : సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు.. నిందితులకు ఖాకీల మర్యాదలు..!

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును కడప జిల్లాకు ఇంచార్జ్ నియమించారు. కడప జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకున్న వెంటనే.. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి వర్రా రవీంద్రారెడ్డి కోసం గాలిస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లి గాలించారు. రవీంద్రారెడ్డి స్నేహితులు, కొందరు వైసీపీ నాయకుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని పట్టుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో తనకు తెలిసిన వారి దగ్గర రెండు రోజులు తలదాచుకున్న వర్రా.. కర్నూలు చెక్ పోస్ట్ దగ్గర ఇవాళ పోలీసులకు చిక్కాడు. మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతంలో పోలీసు ప్రత్యేక బృందాలు వర్రాను హ్యాండోవర్ చేసుకుని కడపకు తరలిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న రవీంద్రారెడ్డి.. కూటమి అగ్రనేతలకు చెందిన వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ కావడం, వాళ్ల గురించి, వాళ్ల కుటుంబసభ్యుల గురించి అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Also Read : పవర్‌లో ఉన్నా ఎందుకీ ఆవేశం? అసలు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి..