ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం, రాత్రి 9 కల్లా తుది ఫలితాలు- సీఈవో మీనా

ఆ మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు.

Ap Election Results 2024 : ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ప్రధాన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆరోజు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.

సీఈవో ముకేశ్ కుమార్ మీనా..
”ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాల వెల్లడి. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడి. మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా రిజల్ట్స్ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఆలస్యం కాకుండా టేబుల్స్ పెంపు”.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు