CM Jagan : చంద్రబాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది.

CM Jagan : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. పురంధేశ్వరిని చంద్రబాబు కోవర్టుగా అభివర్ణించారు జగన్. ఏ పార్టీలో ఉన్నా వదినమ్మ బాబు కోవర్టుగా పని చేస్తున్నారని జగన్ ఆరోపించారు. బీఫామ్ ఏ పార్టీది అయినా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే అంటూ ఘాటు విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్. కాకినాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.

”కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ.. బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్సఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది. బాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే.. బీఫామ్ బీజేపీది అయినా, భీఫామ్ కాంగ్రెస్ ది అయినా, భీఫామ్ టీ గ్లాస్ ది అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే.

చంద్రబాబు మ్యానిఫెస్టో ఎన్నికలు అయ్యేవరకు రంగురంగుల స్వప్నాలు చూపిస్తుంది. ఎన్నికలయ్యాక అదే మ్యానిఫెస్టో చెత్త బుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలయ్యాక ప్రజలకు చంద్రబాబు ఎప్పుడూ చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, క్యారెక్టర్. చంద్రబాబు ఎందుకింత దిగజారారు? ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు? ఎందుకింత కుతంత్రాలు చేస్తున్నారు? ఎందుకిన్ని మోసాలు చేస్తున్నారు? ఎందుకిన్ని అబద్దాలు చెబుతున్నారు? ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నారు? దీని పై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.

కారణం ఏంటంటే.. చంద్రబాబు పాలనలో చరిత్రను మించే మైలురాళ్లు ఏవీ లేవు. వ్యవస్థలు, మంచి పథకాలు, ప్రజలకు చేసిన మంచి.. ఇలాంటి పునాది రాళ్లు ఏవీ కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశానంటారు. కానీ, ఆయన పేరు చెబితే కనీసం ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా?” అని నిలదీశారు సీఎం జగన్.

Also Read : చింతమనేని సీటుకు బీజేపీ గాలం.. దెందులూరు వదులుకోవడంపై టీడీపీ టెన్షన్!

 

ట్రెండింగ్ వార్తలు