ఎన్నికల వేళ జనసేనకు సింబల్ కష్టాలు.. ఈసీ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 10శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది.

Janasena Symbol Problems : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి. జనసేన అభ్యర్థులు లేని చోట్ల గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ గా ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాసు గుర్తును కేటాయించినట్లు పేర్కొంది. అయితే, జనసేన అభ్యర్థులు పోటీలో లేకపోతే ఫ్రీ సింబల్ అవుతుందని చెప్పింది. అభ్యర్థి పోటీలో లేకపోతే ఇండిపెండెంట్లు కోరుకుంటే గ్లాసు సింబల్ ను వారికి కేటాయించే ఛాన్స్ ఉంది.

రాష్ట్రంలో 10శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది. జనసేన వినతిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింబల్ తో ఇబ్బంది తలెత్తకుండా జనసేన ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది కోరుకుంటే లాటరీ తీయనున్నారు.

జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాలు ఇచ్చింది. పేరా 10B ప్రకారం అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు ఈసీఐ పేర్కొంది. పేరా 10B ప్రకారం జనసేన అభ్యర్థి పోటీలో లేనట్లయితే ఫ్రీ సింబల్ అవుతుందని స్పష్టం చేసింది ఈసీ. అలాంటి స్థానాల్లో ఇండిపెండెంట్లు కోరుకుంటే వారికి గ్లాస్ సింబల్ ను కేటాయించే అవకాశం ఉంది.

Also Read : అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు

 

ట్రెండింగ్ వార్తలు