TDP Pending Seats : టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత.. ఇంకా పెండింగ్‌లో ఎన్ని సీట్లు అంటే

ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.

TDP Pending Seats : ఏపీలో 10 స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 139మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే, తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్థుల్లో పి.గన్నవరం, అనపర్తి, అరకు స్థానాలను జనసేన, బీజేపీలకు సర్దుబాటు చేసింది.

ఇంకా 8 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. పాడేరు, చీపురుపల్లి, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, ఆనంతపురం అర్బన్, గుంతకల్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.

అటు.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ నేతలు సిద్దార్ధ్ నాధ్ సింగ్, మధుకర్ కూడా వచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్ ప్రచార వ్యూహం, ఉమ్మడి సభలు, మ్యానిఫెస్టోపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

Also Read : ధర్మవరం టికెట్ ఆయనకే- ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

ట్రెండింగ్ వార్తలు