Undi Tdp Ticket Row
Undi Tdp Ticket Row : ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తార స్థాయికి చేరింది. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారంతో అక్కడి శ్రేణుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండి టికెట్ ను రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారన్న ప్రచారంతో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. తనకు ఇబ్బంది వచ్చింది అనగానే తన వెంట నడవటానికి వచ్చిన వారందరికీ రుణపడి ఉంటానంటూ కన్నీరుకార్చారు.
ఉగాది రోజు ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రామరాజుకి కాకుండా రఘురామకృష్ణరాజుకి కేటాయిస్తారన్న ప్రచారంతో రామరాజు వర్గం టీడీపీ నేతలు, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. తమ నిరసన తెలిపారు. మంతెన రామరాజును మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు.
ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజుని మార్చొద్దు అంటూ ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. వుయ్ వాట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజుని మారిస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని ఆయన మద్దతుదారులు, అభిమానులు తేల్చి చెప్పారు. మంతెన రామరాజు మద్దతుదారులు ఆందోళనకు దిగడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. దీనిపై చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Also Read : ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చరిత్రే.. భీమిలిలో గురు శిష్యుల మధ్య రసవత్తర పోరు