Ap Election Results 2024 : ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అంతటా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపుపై ప్రధాన పార్టీల్లో ధీమా వ్యక్తమవుతోంది. మళ్లీ అధికారం తమదే అంటోంది వైసీపీ. రెండోసారి అధికారంలోకి వస్తామని పార్టీ నేతలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇటు తమ విజయం ఖాయం అంటోంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెబుతోంది. దీనిపై ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇంతకీ ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఫ్యాన్ స్పీడ్ ఎంత? సైకిల్ జోరెంత? ఇన్ డీటైల్డ్ అనాలసిస్..
మరోసారి గెలుపు మాదే అంటున్న వైసీపీ ధీమాకు కారణలు ఇవేనా?
1. ఐదేళ్ల పాటు అమలు చేసిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు
2. భేషజాలు లేకుండా అర్హులందరికీ మ్యానిఫెస్టో అమలు చేశామనే భావన
3 వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటికే పెన్షన్ స్కీమ్ అమలు
4. పార్టీ, ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం పాటించామనే భావన
5. ఏపీలో 4 సీపోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం
6. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ
7. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లు, రైతుభరోసా కేంద్రాలు
8. అభ్యర్థుల మార్పు, సామాజిక కూర్పు
9. ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించడం
10. సిద్ధం సభలు, బస్సు ప్రచారంతో క్యాడర్ లో జోష్
11. రూరల్, మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల లాభిస్తుందనే అంచనా
12. ఐప్యాక్ టీమ్ వర్క్, పోల్ మేనేజ్‌మెంట్
విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ కు కారణాలు ఇవేనా?
1. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత
2. నారా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి
3. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు
4. మూడు పార్టీల మధ్య పరస్పర సహకారం
5. సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీపై విమర్శలు
6. ఎప్పుడూ లేని విధంగా ముందుగానే సీట్ల ప్రకటన
7. ఏడాది ముందుగానే ప్రజల్లోకి సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టో
Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..