YCP
Ycp Election Incharges : అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసిన వైసీపీ.. తాజాగా ఎలక్షన్ ఇంఛార్జులు, అజ్జర్వర్లపై నియామకంపై ఫోకస్ పెట్టింది. పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇంచార్జులను, అబ్జర్వర్లను నియమించింది వైసీపీ.
పొన్నూరు, మంగళగిరి ఎలక్షణ్ ఇంచార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించింది. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ ఎలక్షన్ ఇంఛార్జిగా మర్రి రాజశేఖర్.. సత్తెనపల్లి, చిలకలూరిపేట, పర్చూరు, సంతనూతలపాడు, వేమూరుకు ఎలక్షన్ ఇంఛార్జిగా మోదుగుల వేణుగోపాల్ ను నియమించింది. రేపల్లె నియోజకవర్గం ఎలక్షన్ అబ్జర్వర్ గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు.
Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్ సీటు