Horoscope Today in Telugu : రాశిఫలాలు 16 ఏప్రిల్ 2026.. అదృష్టం అంటే ఈ రాశి వారిదే.. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు.. ఆకస్మిక ధనలాభం..!
Daily Horoscope April 16 in Telugu : ఏప్రిల్ 16, గురువారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..
Horoscope Today 16 April 2026 thursday Rasi Phalalu Telugu
Horoscope Today in Telugu 15 April 2026 : చాలా మందికి రాశి ఫలాల మీద బోలెడు నమ్మకం. అందుకే ప్రతి రోజు ఉదయాన్నే లేవగానే, ఆ రోజు తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయని కచ్చితంగా తెలుసుకుంటారు. సానుకూలంగా ఉంటే సంతోషిస్తారు, ప్రతికూలంగా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఏప్రిల్ 16, గురువారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఎవరిని అదృష్టం వరించనుంది? ఎవరికి ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదురవుతాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మేషం:
ఏప్రిల్ 16, గురువారం నాడు మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయంటున్నారు. అనవసర ఖర్చులు, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగవచ్చు. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
పరిహారం: అయ్యప్ప స్వామి లేదా హరహర క్షేత్ర దర్శనం.
వృషభం:
గురువారం నాడు వృషభ రాశి వారికి అనూహ్య ఫలితాలు ఎదురవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి.
పరిహారం: మంగళ చండికా స్తోత్ర పారాయణ, అమ్మవారి దర్శనం.
మిథునం:
నేడు ఏప్రిల్ 16, గురువారం నాడు మిథున రాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
పరిహారం: మెరుగైన ఫలితాల కోసం ఈ రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణ, గ్రామ దేవత దర్శనం చేసుకోవాలి.
కర్కాటకం:
గురువారం నాడు కర్కాటక రాశి వారికి ఆర్థికపరంగా, భూ సంబంధిత విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి.
పరిహారం: వేంకటేశ్వర విజయ స్తోత్ర పారాయణ, శివాలయ దర్శనం.
సింహం:
సింహ రాశి వారు గురువారం నాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరీ ముఖ్యంగా ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అవమానాలు, అపనిందలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పరిహారం: దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ, అమ్మవారి దర్శనం.
కన్య:
కన్య రాశి వారికి సర్వత్ర అనుకూలంగా ఉంది. నేడు ఈ రాశి వారికి సమాజంలో, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పరిహారం: దత్త స్తవం పారాయణ, దత్తాత్రేయ లేదా శివాలయ దర్శనం.
తుల:
తుల రాశి వారు గురువారం నాడు రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
పరిహారం: దక్షిణామూర్తి అష్టకం పారాయణ, శివాలయ దర్శనం.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారు నేడు పిల్లల విషయంలో ఆందోళన చెందుతారని, వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.
పరిహారం: హయగ్రీవ కవచ పారాయణ, విష్ణు దేవాలయ దర్శనం.
ధనుస్సు:
ధనస్సు రాశి వారికి గురువారం నాడు ప్రతికూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు, చికాకులు తలెత్తుతాయి. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.
పరిహారం: దుర్గ ద్వాత్రింశతి నామావళి పారాయణ, దుర్గాదేవి దర్శనం.
మకరం:
గురువారం నాడు మకర రాశి వారికి సమయం అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో లాభం పొందుతారు. స్త్రీ మూలక ధన యోగం ప్రాప్తించనుంది. పాత బాకీలు వసూలవుతాయి.
పరిహారం: కార్యసిద్ధి హనుమాన్ స్తోత్ర పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం.
కుంభం:
ఏప్రిల్ 16, నేడు గురువారం కుంభ రాశి వారికి ఏమాత్రం సానుకూలంగా లేదు. ప్రయాణాల్లో అవాంతరాలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది.
పరిహారం: దత్త స్తవం పారాయణ, దత్తాత్రేయ దేవాలయ సందర్శన.
మీనం:
గురువారం, ఏప్రిల్ 16 నాడు మీన రాశి వారు అన్ని రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపారంలో లాభాలు చవిచూస్తారు.
పరిహారం: సప్త చిరంజీవ స్తోత్ర పారాయణ.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
