Today Horoscope April 18 in Telugu : రాశి ఫలాలు 18 ఏప్రిల్.. ఈ రాశి వారు నక్క తోక తొక్కారు.. పెళ్లి కుదురుతుంది..!
Daily horoscope in Telugu 18 April : శనివారం కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది. వారు తలపెట్టిన పనులన్నింటిలో విజయం సాధిస్తారు.
Horoscope Today 18 April 2026 saturday Rasi Phalalu Telugu
Today Horoscope April 18 in Telugu : వైశాఖ మాసం ప్రారంభం కావడంతో ఈ రోజు నుండి వైశాఖ స్నానాలు మొదలవుతాయి. శనివారం మధ్యాహ్నం వరకు పాడ్యమి తిథి కొనసాగనుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆరాధన అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మరి ఏప్రిల్ 18, శనివారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. ఎవరికి కలిసి వస్తుంది.. ఎవరు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు అంటే..
1. మేష రాశి
శనివారం నాడు మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్తు, వాహన ప్రాప్తి కలదు.
పరిహారం: కాలభైరవ అష్టకం పారాయణం, శివాలయ దర్శనం చేస్తే ప్రయోజనం.
2. వృషభ రాశి
నేడు శనివారం వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, భయాందోళనలు ఉండవచ్చు. అకస్మిక బదిలీలు లేదా స్థాన చలనం సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు (షూరిటీ) ఇవ్వకండి.
పరిహారం: రాహు కవచం పారాయణం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయాలి.
3. మిధున రాశి
శనివారం నాడు మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా జయం చేకూరుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు.
పరిహారం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, గురుదేవాలయ దర్శనం.
4. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 19, శనివారం ఆందోళనలు, అధిక ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి.
పరిహారం: శ్రీ మూకాంబికా స్తోత్రం పఠించడం, దుర్గాదేవి దర్శనం శ్రేయస్కరం.
5. సింహ రాశి
శనివారం సింహ రాశి వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం, అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది.
6. కన్య రాశి
శనివారం కన్య రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది.
పరిహారం: వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం.
7. తులా రాశి
తులా రాశి వారికి శనివారం అన్ని విధాలా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం పొందుతారు.
పరిహారం: శనేశ్వర కవచం పఠనం, శివాలయ దర్శనం.
8. వృశ్చిక రాశి
ఏప్రిల్ 18, శనివారం వృశ్చిక రాశి వారికి అవరోధాలు, అపనిందలు ఎదురవ్వచ్చు. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి.
పరిహారం: నరసింహ స్తుతి పారాయణం, విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది.
9. ధనుస్సు రాశి
శనివారం ధనుస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. భవిష్యత్తుకు ఉపయోగపడే కీలక వ్యక్తులను కలుస్తారు.
పరిహారం: దైన్యాష్టకం పారాయణం, లక్ష్మీ ఆరాధన.
10. మకర రాశి
ఏప్రిల్ 18, శనివారం మకర రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆస్తి తగాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
పరిహారం: దశరథ కృత శని స్తోత్రం పారాయణం.
11. కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ శనివారం అన్ని విధాలా అనుకూలమైన రోజు. క్లిష్టమైన పనులను నేర్పుగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.
పరిహారం: హనుమత్ స్తోత్ర పారాయణం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన.
12. మీన రాశి
ఏప్రిల్ 18, శనివారం నాడు మీన రాశి వారికి ఒత్తిడి, అధిక ఖర్చులు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. పిల్లల విషయంలో కొంత మానసిక ఆందోళన కలగవచ్చు.
పరిహారం: కిరాతాష్టకం పారాయణం, శివ లేదా విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఉత్తమం.
