Mithuna Rasi Phalalu 2026 : మిథున రాశి వారు నక్క తోక తొక్కబోతున్నారు.. లగ్జరీ లైఫ్, అప్పులన్నీ తీరిపోతాయి.. కానీ అదొక్కటే సమస్య..!
Mithuna Rasi Phalalu 2026 : 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే వివరాలు..
- Dharani Pilli
- Published On : March 13, 2026 / 06:02 PM IST
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 mithuna rasi phalalu gemini horoscope
Mithuna Rasi Phalalu 2026 : మిథున రాశి వారిని వరించనున్న అదృష్టం.. లగ్జరీ లైఫ్, అప్పులన్నీ తీరిపోతాయి.. కానీ అదొక్కటే సమస్య..!
ఉగాది నాటి నుంచి మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుందని, గొప్ప విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వారు పెళ్లిళ్లు చేస్తారని.. బంధుమిత్రుల సాయం పరిపూర్ణంగా దక్కుతుందని.. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అంటున్నారు. ఆదాయం, రాజపూజ్యం బాగా ఉండగా.. వ్యయం, అవమానం తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో అద్భుతమైన అభివృద్ధి, విజయాలు ఉంటాయంటున్నారు. ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని.. అన్ని రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉండబోతుంది అంటున్నారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుపుతారని.. బంధుమిత్రుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు ఉంటాయని.. విలాసవంతమైన, సౌఖ్యవంతమైన జీవితం గడుపుతారని పండితులు చెబుతున్నారు. అలానే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని.. ఇన్నాళ్లు పీడించిన శత్రు బాధలు తొలగిపోతాయని అంటున్నారు.
వివిధ రంగాల వారి ఫలితాలు
- విద్యార్థులు: మిథున రాశికి చెందిన విద్యార్థులు ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లో.. ఉన్నత శ్రేణిలో ర్యాంకులు సాధిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుంది.
- ఉద్యోగస్థులు: మిథున రాశి ఉద్యోగస్థులు పని ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ.. దానిని తట్టుకుని పని చేస్తే ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కోరుకున్న చోటికి బదిలీలు అవుతాయి.
- వ్యవసాయదారులు: ఈ ఏడాది మిథున రాశి రైతులను అదృష్టం వరిస్తుందని.. రైతన్నల పంటలు బాగా పండుతాయని.. అప్పుల ఊబి నుంచి బయటపడతారని అంటున్నారు.
- వ్యాపారస్తులు: వ్యాపారస్తుల బిజినెస్ బాగా జరిగి మంచి లాభాలు ఆర్జిస్తారు.
- కళాకారులు, క్రీడాకారులు: ఈ ఏడాది మిథున రాశికి చెందిన కళాకారులు, క్రీడాకారులకు మంచి పారితోషికం లభిస్తుంది.. అవార్డులు, గుర్తింపు లభిస్తాయంటున్నారు.
- రాజకీయ నాయకులు: ఈ సంవత్సరం మిథున రాశి రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుని.. ప్రజాదరణ, పలుకుబడి పెరుగుతుందంటున్నారు.
- కాంట్రాక్టర్లు: మిథున రాశి కాంట్రాక్టర్లకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా కలిసి వస్తుందని.. వారికి పెద్ద కాంట్రాక్టులు, లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
- స్త్రీలు: వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి వరుడు వస్తాడు. ఇంటికి అవసరమైన వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేస్తారు.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- మృగశిర (3, 4 పాదాలు) ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027) సోమ, గురు, శని 2, 3, 4, 7
- ఆరుద్ర (1-4 పాదాలు) ఏప్రిల్, మే, సెప్టెంబర్, జనవరి (2027) ఆది, మంగళ, బుధ 2, 4, 5, 6
- పునర్వసు (1, 2, 3 పాదాలు) మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి సోమ, గురు, శని 2, 3,
పరిహారాలు :
మిథున రాశి వారు మెరుగైన ఫలితాలు, దృష్టి దోషాల నుంచి తప్పించుకోవడానికి రాహువు, కేతువులకు పూజలు చేసి, మినుములు, ఉలవలు దానం ఇవ్వాలి.
- దైవ దర్శనం: కనకదుర్గ అమ్మవారు, వారాహి అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది.
- శనివారాలు: శని దేవునికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మరింత శుభం కలుగుతుంది.
- స్తోత్రాలు: భ్రమరాంబిక అష్టకం లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజూ చదవడం లేదా వినడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
