Tula Rasi Phalalu 2026 : తులా రాశి వారికి రాజయోగం.. ఈ ఆలయాలను దర్శించుకుంటే.. ఇక మీకు తిరుగే లేదు..!
Tula Rasi Phalalu 2026 : 2026 సంవత్సరంలో తులా రాశి వారికి రాజయోగం పట్టబోతుంది అంటున్నారు పండితులు.
- Dharani Pilli
- Updated on- March 15, 2026 / 02:00 PM IST
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 tula rasi phalalu libra horoscope
Tula Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి రాజయోగం పట్టబోతుందని.. అనుకున్న పనులన్ని పూర్తి చేస్తారని.. చేతిలో ఎప్పుడు డబ్బు అందుబాటులో ఉంటుంది.. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. తులా రాశి వారు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారు. భూములు, ఇళ్లు, పొలాలు కొంటారు.. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుపుతారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, వ్యవసాయం చేసుకునేవారు, స్త్రీలు ఇలా ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. అప్పులు తీర్చి.. ఆదాయం మిగుల్చుకుంటారని వెల్లడించారు.
తులా రాశి వారికి ఆదాయం: 5, వ్యయం:14, రాజపూజ్యం: 6, అవమానం: 3
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
చిత్త (3, 4 పాదాలు) ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027) మంగళ, బుధ, శని 2, 3, 4, 6
స్వాతి (1-4 పాదాలు) ఏప్రిల్, మే, సెప్టెంబర్, జనవరి (2027) ఆది, మంగళ, బుధ 3, 4, 5, 6
విశాఖ (1, 2, 3 పాదాలు) మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి (2027) ఆది, సోమ, మంగళ 3, 6, 7
పరిహారాలు-పూజలు:
- తులా రాశి వారు కేవలం రాహు గ్రహానికి పూజలు చేసి మినుములు దానం చేస్తే సరిపోతుంది.
- దైవ దర్శనం: కనకదుర్గ, రాజరాజేశ్వరి లేదా కామాక్షి అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడం వల్ల రాజయోగం కలుగుతుంది.
- స్తోత్ర పఠనం: దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం చదువుకోవడం లేదా వినడం మంచిది. దేవీ భాగవతం వినడం విశేష ఫలితాలనిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
