Vrushabha Rasi Phalalu 2026: 2026 సంవత్సరంలో అదృష్టం అంటే వృషభ రాశి వారిదే.. సొంతిల్లు, ప్రమోషన్, ప్రభుత్వ ఉద్యోగం, వివాహం.. అన్ని లాభాలే..!
Vrushabha Rasi Phalalu 2026: 2026 ఉగాది పండగ తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంట..
- Dharani Pilli
- Updated on- March 15, 2026 / 02:06 PM IST
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 vrushabha rasi phalalu Taurus horoscope
ఉగాది నాడు ప్రతి ఒక్కరూ రాశి ఫలితాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. మరి ఈ 2026 నుంచి 2027 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది.. ఆదాయం, రాజపూజ్యం, వ్యయం, అవమానం వంటివి ఎలా ఉండబోతున్నాయో.. రంగాల వారీగా ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.ఈ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం శుభ ఫలితాలే వస్తాయి. ధనలాభం కూడా బాగా ఎక్కువగా ఉండబోతోంది.
ఆదాయం: 5, వ్యయం: 14; రాజపూజ్యం: 5, అవమానం: 4 గా ఉంటుందని చెబుతున్నారు.
గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం సొంత ఇల్లు కొనుక్కోవడం, నిర్మించే పనులు మొదలుపెడితే కలిసి వస్తుంది అంటున్నారు. కారణం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా బలమైన యోగం ఉంది. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది అంటున్నారు పండితులు.అలానే ఈ ఏడాది వృషభ రాశి వారికి సమాజంలో పెద్ద హోదా కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడి.. ప్రయోజనం కలుగుతుందని.. వారికి సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని.. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారని తెలుపుతున్నారు. ఈ ఏడాదంతా వృషభ రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయని.. కాకపోతే దృష్టి దోషం, శత్రు బాధల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.
రంగాలవారీగా ఫలితాలు..
- విద్యార్థులకు: వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ ఏడాది పోటీ పరీక్షలలో(ఇంజినీరింగ్, మెడిసిన్) బ్రహ్మాండమైన ర్యాంకులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
- ఉద్యోగస్థులకు: ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగం వారికి మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి.
- వ్యవసాయదారులకు: పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు.
- వ్యాపారస్తులకు: ఐరన్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ మరియు ఆయిల్ వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. క్రయ విక్రయాలు చాలా బాగుంటాయి.
- కళాకారులు, క్రీడాకారులకు: వృషభరాశికి చెందిన కళాకారులు, క్రీడాకారులకు ఈ సంవత్సరం బాగా కలిసి రానుంది. వారికి గొప్పపేరు, డబ్బుతో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. కళారంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం.
- రాజకీయ నాయకులకు: వృషభ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ ఏడాది ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడం వల్ల మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది.
- స్త్రీలకు: వృషభ రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్న మహిళలకు ప్రమోషన్లు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్న ఆడపిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
- నక్షత్రం కలిసి వచ్చే నెలలు అదృష్ట వారాలు అదృష్ట సంఖ్యలు
రోహిణి నక్షత్రం మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్, జనవరి (2027) బుధ, గురు, శని. 1, 2, 3, 4. - మృగశిర నక్షత్రం ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027) సోమ, గురు, శని. 2, 3, 4, 7.
పరిహారాలు: గురు మరియు కేతు గ్రహాలకు జపాలు చేయించుకోవాలి. శెనగలు, ఉలవలు దానం ఇవ్వాలి. దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య అష్టకం, లింగాష్టకం పఠించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
