1.5 Ton Split AC : వేసవిలో కొత్త ఏసీ కావాలా? ఈ టాప్ బ్రాండ్ల ఏసీలపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోండి!

1.5 Ton Split AC : 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ప్రస్తుతం అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వర్ల్‌పూల్, వోల్టాస్, లాయిడ్ వంటి టాప్ బ్రాండ్‌ల మోడళ్లపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.

1 5 Ton Split ACs

1.5 Ton Split AC Price Cut : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంట్లో ఏసీ లేదా కూలర్ తప్పక ఉండాల్సిందే. ఎండలు పెరిగే కొద్ది ఏసీలు, కూలర్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోతుంటాయి. అందుకే ముందుగానే మార్కెట్లో మంచి ఏసీని కొని ఇంటికి తెచ్చుకోవడం బెటర్. ప్రస్తుతం అనేక బ్రాండ్ల ఎయిర్ కండిషనర్లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా
1.5 టన్ స్ప్లిట్ ఏసీ అద్భుతమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : Realme P3 Pro 5G : భలే డిస్కౌంట్ భయ్యా.. రియల్‌మి లవర్స్ ఈ 5G ఫోన్ అసలు వదులుకోవద్దు.. ఎందుకంటే?

ఇంతకన్నా బెస్ట్ టైమ్ మరొకటి ఉండదు. మీరు Samsung, Lloyd, Voltas, Carrier వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఎయిర్ కండిషనర్లను 50 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ, భారత్ అంతటా ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.

మీరు మీ ఇంట్లో కొత్త AC కొనేందుకు చూస్తుంటే.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో టాప్ 5 బ్రాండ్ల ఏసీలపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఏసీ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
ఈ వోల్టాస్ ఎయిర్ కండిషనర్ ప్రస్తుతం అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది. అసలు ధర రూ.67,990 ఉండగా, కేవలం రూ.33,990కే పొందవచ్చు. అదనంగా, ఈ కొనుగోలుపై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగిన 4-ఇన్-1 అడ్జస్టబుల్ మోడ్, యాంటీ-డస్ట్ ఫిల్టర్ వంటి బెనిఫిట్స్ కలిగి ఉంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది.

గోద్రేజ్ 1.5 టన్ ఏసీ :
గోద్రేజ్ నుంచి వచ్చిన ఈ AC 26 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏసీ ధర రూ.45,900 నుంచి రూ.33,990కి తగ్గింది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ సిస్టమ్‌తో రూపొందింది. అంతేకాకుండా, మీ కొనుగోలుతో మీరు 5 ఏళ్ల పూర్తి వారంటీని కూడా పొందవచ్చు.

వర్ల్‌పూల్ 1.5 టన్ ఏసీ :
48 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వర్ల్‌పూల్ ఏసీ ధర మొదట రూ. 62వేలుగా ఉంది. అయితే, ఇప్పుడు రూ. 32,490కు కొనుగోలు చేయవచ్చు. 4-ఇన్-1 కూలింగ్ మోడ్‌ను కలిగి ఉంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. మీ ఇంటి గదిని కూలింగ్ చేసేందుకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

లాయిడ్ 1.5 టన్ ఏసీ :
ఈ లాయిడ్ ఎయిర్ కండిషనర్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో కూడా వస్తుంది. లాయిడ్ 1.5 టన్ ధర రూ.58,990. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత రూ.34,490కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా, 5-ఇన్-1 కన్వర్టిబుల్ టెక్నాలజీతో పాటు అదనంగా రూ.1,000 డిస్కౌంట్ అందించే కూపన్ అందుబాటులో ఉంది.

Read Also : Vivo V27 Series : వివో కొత్త సిరీస్ భలే ఉందిగా.. టచ్ చేస్తే కలర్ మారే ఖతర్నాక్ ఫోన్.. డిస్కౌంట్లో వస్తుంటే ఎవరైనా వద్దంటారా..!

క్యారియర్ 1.5 టన్ ఏసీ :
క్యారియర్ ఎయిర్ కండిషనర్ ప్రస్తుతం 44 శాతం తగ్గింపుతో అందిస్తోంది. అసలు ధర రూ.76,090 ఉండగా కేవలం రూ.42,990కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్వర్టర్ టెక్నాలజీ, 6-ఇన్-1 కూలింగ్ సిస్టమ్, స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.